బాణాసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-10-30T03:27:18+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాణాసంచా దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఐ గిరిబాబు, తహసీల్దారు శ్రీనివాసులు సూచించారు.

బాణాసంచా దుకాణదారులు నిబంధనలు పాటించాలి
దుకాణ లైసెన్సులు పరిశీలిస్తున్న సీఐ, తహసీల్దారు

ఉదయగిరి రూరల్‌, అక్టోబరు 29: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాణాసంచా దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సీఐ గిరిబాబు, తహసీల్దారు శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం సిబ్బందితో కలిసి పట్టణంలో బాషామొహీద్దీన్‌ ఫైర్‌వర్క్సు దుకాణాన్ని పరిశీలించారు. దుకాణంలో వసతులు, కార్మికుల వివరాల పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. కరోనా కారణంగా బాణాసంచా తయారు చేయడంలేదని యజమాని సూచించారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు అంకమ్మ, సాయిరెడ్డి, అగ్నిమాపక శాఖాధికారి రమేష్‌బాబు, ఏఎస్‌వో రాజేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-30T03:27:18+05:30 IST