‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు!’

ABN , First Publish Date - 2021-02-07T04:53:19+05:30 IST

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్‌పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులురెడ్డి, పూల చంద్రశేఖర్‌ అన్నారు.

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు!’
నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌పార్టీ నాయకులు

గూడూరు, ఫిబ్రవరి 6: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్‌పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులురెడ్డి, పూల చంద్రశేఖర్‌ అన్నారు. పరిశ్రమలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా స్థానిక రైతుబజారు సమీపంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో వేమయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-07T04:53:19+05:30 IST