విజేతలకు బహుమతుల ప్రదానం
ABN , First Publish Date - 2021-10-30T03:22:59+05:30 IST
వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు ప్రదానం చేశారు.
మనుబోలు, అక్టోబరు 29: వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో బహుమతులు ప్రదానం చేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం విజిలెన్స్‌పై అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు 75ఏళ్ల భారతంలో అవినీతి, స్వావలంబన అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పదవ తరగతి నుంచి 5మందిని, 8,9 తరగతులకు చెందిన 5మంది విద్యార్థులను విజేతలుగా ఎంపిక చేసి వారికి పవర్‌గ్రిడ్ సీనియర్ డీజీఎం ఏవీ చారి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ జేపీవో నరేష్, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు కాంతారావు, ఉపాధ్యాయుడు రాధయ్య, ఎన్‌జీవో ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.