విద్యాప్రమాణాలు పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-01-01T04:34:43+05:30 IST

విద్యా ప్రమాణాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కోరారు.

విద్యాప్రమాణాలు పెంపొందించాలి
విద్యార్థుల నుంచి విద్యా ప్రమాణాలను తెలుసుకుంటున్న డీఈవో రమేష్‌

గూడూరు, డిసెంబరు 31:  విద్యా ప్రమాణాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ కోరారు. శుక్రవారం స్థానిక జడ్పీబాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లబాషపై  విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రవూఫ్‌, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-01T04:34:43+05:30 IST