విద్యకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2021-08-21T04:39:35+05:30 IST

విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రులు నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అయితే.. నేడు జగన్మోహన్‌రెడ్డిలు మాత్రమేనని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.

విద్యకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి

 ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి


టీపీగూడూరు, ఆగస్టు 20 : విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రులు నాడు   వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అయితే.. నేడు జగన్మోహన్‌రెడ్డిలు మాత్రమేనని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ముంగలదొరువులో నాడు-నేడు పథకం కింద నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడు హజరత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ  ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మనబడి, నాడు-నేడు పథకం కింద రూ.25 కోట్లు, నాబార్డు కింద రూ.5కోట్ల నిధులను స్కూళ్ల ఆధునికీకరణ పనుల కోసం సీఎం  జగన్మోహన్‌రెడ్డి మంజూరు చేశారని పేర్కొన్నారు. అలాగే మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఆధునీకరణ కోసం రూ.5.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, మాజీ జడ్పీటీసీ చిరంజీవిగౌడ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యంగౌడ్‌, ఎంపీడీవో కన్నం హేమలత, తహసీల్దారు శ్యామలమ్మ, ఎంఈవో సన్నపురెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దారు వినుకొండ ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-21T04:39:35+05:30 IST