విద్యా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , First Publish Date - 2021-10-30T03:33:13+05:30 IST
విద్యాచట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి విద్యార్థులకు సూచించారు.
కోట, అక్టోబరు 29 : విద్యాచట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి గాయత్రి విద్యార్థులకు సూచించారు. విద్యానగర్ ఎన్‌బీకేఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం న్యాయ విజ్ఞానసదస్సు సందర్భంగా న్యాయమూర్తి ఆమె మాట్లాడారు. ప్రతి విద్యార్థి చట్టాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, న్యాయవాదులు అనురాధ, బాబురెడ్డి, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.