ఆకట్టుకున్న కేక్‌లు

ABN , First Publish Date - 2022-01-01T04:40:40+05:30 IST

నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి పట్టణంలోని స్వీట్‌ స్టాల్‌, బేకరీల్లో వివిధ రూపాల్లో రకరకాల కేక్‌లను తయారు చేసి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకున్న కేక్‌లు
ఉదయగిరిలో వివిధ ఆకారాల్లో కేక్‌లు

ఉదయగిరి, డిసెంబరు 31: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి పట్టణంలోని స్వీట్‌ స్టాల్‌, బేకరీల్లో వివిధ రూపాల్లో రకరకాల కేక్‌లను తయారు చేసి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. విమానం, ఓడ, కారు, సీతాకోకచిలుక తదితర ఆకృతులతో ఉన్న కేకులు ఆకట్లుకున్నాయి. ఈ కేకులు రూ.300 నుంచి రూ.1500 వరకు విక్రయించారు. అలాగే వస్త్ర, పూల, నిత్యావసర వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో శుక్రవారం రద్దీగా కనిపించాయి.

కేకులకు భలే గిరాకీ

నూతన సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో శుక్రవారం పట్టణంలోని స్వీట్‌ స్టాల్స్‌ వద్ద కేకులు, స్వీట్లు కొనుగోలుతో రద్దీ నెలకొంది. దుకాణదారులు రకరకాల ఆకారాల్లో కేక్‌లు తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేయడంతో యువకులు, రాజకీయ నాయకులు, పిల్లలు కేకుల కొనుగోలుకు ఎగబడ్డారు. 2021కు వీడ్కోలు పలికి 2022కి స్వాగతం పలికే ఏర్పాట్లలో ప్రజలు నిమగ్నమయ్యారు. అలాగే తమ తమ అభిమాన రాజకీయ నేతలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నాయకులు, కార్యకర్తలు బిజీ అయ్యారు. 

Updated Date - 2022-01-01T04:40:40+05:30 IST