ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-05-03T04:22:26+05:30 IST

నగరంలోని మూలాపేట రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్స వాలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి.

ముగిసిన వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
వేణుగోపాలుడికి చేపట్టిన పుష్పయాగం

నెల్లూరు(సాంస్కృతికం), మే 2: నగరంలోని మూలాపేట రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్స వాలు ఆదివారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఉదయం నిత్యపూజలు, విశేష అలంకారం, చక్రస్నానాలు జరిగాయి. మధ్యాహ్నం తిరుమంజ నం సేవ కనుల పండువగా జరిగింది. సాయంత్రం పూలంగిసేవ, విశే ష పూజలు అనంతరం ధ్వజావరోహణం జరిగింది. స్వామివారికి పుష్ప యాగం చేశారు. చివరి ఉత్సవంగా ఏకాంతసేవ వైభవంగా నిర్వహిం చారు. ఈ బ్రహ్మోత్సవాలు కొవిడ్‌ నిబంధనల మేరకు జరిగాయి. భక్తులు అందరూ మాస్క్‌లు ధరించి దర్శనం చేసుకుని దేవస్థానం సిబ్బందికి సహకరించినందుకు ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఉభయకర్తలు, ఆలయం చైర్మన్‌ మన్నెం లక్ష్మీనాథ్‌రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు, ఈవో, సహాయ కమిషనర్‌ జె.శ్రీనివాస రావు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:22:26+05:30 IST