పురుషోత్తముడికి పొన్నవాహన సేవ
ABN , First Publish Date - 2021-09-04T05:08:14+05:30 IST
మూలాపేట రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న కృష్ణావతార ఉత్సవాల్లో భాగంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు ఉదయం తిరుమంజనం జరిగింది. రాత్రి దేవేరులతో కలిసి వేణుగోపాలుడు పొన్న వాహనంలో భక్తులకు దర్శనమిచ్చాడు.

నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 3 : మూలాపేట రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో జరుగుతున్న కృష్ణావతార ఉత్సవాల్లో భాగంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవార్లకు ఉదయం తిరుమంజనం జరిగింది. రాత్రి దేవేరులతో కలిసి వేణుగోపాలుడు పొన్న వాహనంలో భక్తులకు దర్శనమిచ్చాడు. పొన్న వాహనంలో ఆలయ ప్రాకారోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ఈవో సహాయ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.