వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-05-01T04:10:01+05:30 IST

కొవిడ్‌ మ రణాలు తగ్గించడంలో భాగంగా వెంటిలేటర్ల సంఖ్య భారీగా పెంచా లని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు.

వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న పాశిం సునీల్‌కుమార్‌

గూడూరురూరల్‌, ఏప్రిల్‌ 30: కొవిడ్‌  మ రణాలు తగ్గించడంలో భాగంగా వెంటిలేటర్ల సంఖ్య భారీగా పెంచా లని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు. శుక్రవారం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతికి, ఎంతోమంది మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. స్థానిక ఏరి యా ఆసుపత్రిని కొవిడ్‌ సెంటర్‌గా మార్చి 100 పడకలతోపాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సదుపాయా న్ని కల్పించి మరణాల సంఖ్యను నియంత్రించాల న్నారు. అనంతరం టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచనలిచ్చారు. 

Updated Date - 2021-05-01T04:10:01+05:30 IST