వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి : జేసీ

ABN , First Publish Date - 2021-08-11T03:29:07+05:30 IST

: జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ విదేహ్‌ఖరే సూ

వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి : జేసీ
చెన్నూరులో లేఅవుట్‌లను పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే

గూడూరురూరల్‌, ఆగస్టు 10: జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ విదేహ్‌ఖరే సూచించారు. మంగళవారం హౌసింగ్‌శాఖ అధికారులతో కలిసి చెన్నూరులోని లేఅవుట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్‌లలో ఇళ్లనిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్‌, మంచినీటి సౌకర్యం, మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ అధికారులు షబ్బీర్‌, అమర్‌నాధ్‌రెడ్డి, మురళి, ఆసీస్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-11T03:29:07+05:30 IST