కొత్తరకం వరి పంటల పరిశీలన

ABN , First Publish Date - 2021-12-09T03:17:39+05:30 IST

జిల్లా వ్యవసాయశాఖ రిసోర్స్‌ సెంటర్‌ పర్యవేక్షణలో మండలంలోని పూలతోట గ్రామంలో సాగవుతున్న కొత్తరకం వరి పంటలను బుధవా

కొత్తరకం వరి పంటల పరిశీలన
వరి పొలాలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారులు

దొరవారిసత్రం, డిసెంబరు 8 : జిల్లా వ్యవసాయశాఖ రిసోర్స్‌ సెంటర్‌ పర్యవేక్షణలో మండలంలోని పూలతోట గ్రామంలో సాగవుతున్న కొత్తరకం వరి పంటలను బుధవారం రిసోర్స్‌ సెంటర్‌ డీడీఏ శివనారాయణ, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌  ఓబయ్య, ఏడీఏ శ్రీనివాసులు,  తదితరులు పరిశీలించారు.  గ్రామంలో వెంకటేశ్వర్లు, శోభన్‌ బాబు, శ్రీవిద్య అనే రైతులు కొత్తరకం వరి వంగడాలైన బీపీటీ2846, 2824 రకాలు, ఎంసీఎం100, 125 రకాలను ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ రకం పంటల పెరు గుదల ఎలా ఉంది..  ఇవి జిల్లాలో సాగుకు పనికి వస్తా యా.. లేదా ? అనే అంశంపై పరిశీలించారు.  మంచి దిగుబడులు వస్తే ఈ విత్తనాలను సిఫార్సు చేస్తామని వారు తెలియజేశారు.  వారి వెంట స్థానిక ఏవో కాంచన,  సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T03:17:39+05:30 IST