వరి పైరుకు కూలీల సమస్య

ABN , First Publish Date - 2021-05-21T04:06:06+05:30 IST

మండల పరిధిలో వరినార్లు, పైర్లు ముమ్మరంగా సాగుతున్నా.. బాలారిష్టాలు మాత్రం రైతులను సతమతం చేస్తున్నాయి.

వరి పైరుకు కూలీల సమస్య
పైర్లు నాటుతున్న కూలీలు

 ఓ వైపు వేసవి ప్రతాపం.. మరోవైపు కరోనా భయం 


ఇందుకూరుపేట, మే 20 : మండల పరిధిలో వరినార్లు, పైర్లు ముమ్మరంగా  సాగుతున్నా.. బాలారిష్టాలు మాత్రం రైతులను సతమతం చేస్తున్నాయి. ముఖ్యంగా కూలీల సమస్య వెంటాడుతోంది. వేసవి ప్రతాపం ఓ వైపు, కరోనా భయం మరోవైపు ఉండడంతో పైర్లు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. వెంకటాచలం, తోటపల్లిగూడూరు, కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చే కూలీలు కూడా ఇప్పుడు రావటం లేదు. ఈ భయాలతో పాటు ఆయా మండలాల్లో కూడా పైర్లు వేస్తుండటమే. ఒక్క ఇందుకూరుపేట మండలంలోనే వరుసగా 2వేల ఎకరాల నుంచి 5వేల ఎకరాల వరకు పైర్లు వేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో నార్లు ముదిరిపోతాయనే ఆందోళన,  అలాగే సీజన్‌ తప్పుతుందేమోనన్న భయం అన్నదాతల్లో ఉంది. ఇప్పటికీ  మండలంలో దాదాపు ఆరేడు వందల ఎకరాల్లో కూడా పైర్లు పడలేదని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో కరోనా, కూలీల సమస్యతో కష్టాలు పడుతూ వారి కోసం వెతుకులాట ప్రారంభించటం మండలంలో కనిపిస్తుంది. 

Updated Date - 2021-05-21T04:06:06+05:30 IST