కోవూరులో ‘వంగవీటి’కి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-12-27T04:53:37+05:30 IST
కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతిని పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కోవూరు, డిసెంబరు 26: కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతిని పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపురాక్స్ సభ్యుడు నందలగుంట గిరిజన కాలనీలో అన్నదానం చేశారు. అలాగే అనాథ శరణాలయంలోని బాలలకు మధ్యాహ్నం భోజనం అందజేశారు. పట్టణంలోన పలు కూడళ్లలో మోహనరంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కాపురాక్స్ నాయకులు కొండల నాగ్, సంతోష్, జగదీష్, తన్మయ్, హితేష్, రామ్‌చరణ్, అఖిల్, రాఖీ, విష్ణు, దిలీప్‌కుమార్, శరత్‌బాల, మహేష్ తదితరులు పాల్గొన్నారు.