దాడి కేసులో వలంటీరుపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-20T04:24:22+05:30 IST

దాడి కేసులో వలంటీరుపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మనుబోలుపాడు గ్రామానికి చెందిన పైడి రమణయ్య, రామాపురం కొండయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి.

దాడి కేసులో వలంటీరుపై కేసు నమోదు

దగదర్తి, అక్టోబరు 19 : దాడి కేసులో వలంటీరుపై కేసు నమోదైంది. పోలీసుల కథనం  మేరకు.. మండలంలోని మనుబోలుపాడు గ్రామానికి చెందిన పైడి రమణయ్య, రామాపురం కొండయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. పైడి రమణయ్య పొలంలోకి కొండయ్య కొంత కలుపుకున్నాడని సోమవారం మధ్యాహ్నం పొలం వద్ద వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కొండయ్య, అతని కుమారులు ప్రవీణ్‌, ప్రకా్‌షలతోపాటు మేనల్లుడు పైడి సురే్‌షలు పైడి రమణయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో రమణయ్య కాలు విరిగింది. దీంతో బాధితుడు స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసి నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న ఏఎ్‌సఐ జకీర్‌ విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ప్రవీణ్‌ మనుబోలుపాడులో వలంటీరుగా పనిచేయడం గమనార్హం.


Updated Date - 2021-10-20T04:24:22+05:30 IST