వలంటీర్‌ అనిల్‌ కుటుంబానికి అండగా ఉంటా

ABN , First Publish Date - 2021-12-16T04:55:26+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళేనికి చెందిన వలంటీర్‌ తురకా అనిల్‌కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.

వలంటీర్‌ అనిల్‌ కుటుంబానికి అండగా ఉంటా
అనిల్‌ కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కాకాణి

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి


వెంకటాచలం, డిసెంబరు 15 : రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన వెంకటాచలం పంచాయతీ వడ్డిపాళేనికి చెందిన వలంటీర్‌ తురకా అనిల్‌కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాధిత కుటుంబానికి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి, వలంటీర్లతో కలిసి పరామర్శించి, రూ.1లక్ష నగదును అందజేశారు. అనంతరం మండలంలోని రామదాసుకండ్రిగలో ఇటీవల అగ్ని ప్రమాదానికి ఆహుతైన పూరిళ్లును పరిశీలించి, ఆ కుటుంబ సభ్యులకు దుస్తులు, ఆర్థిక సాయం అందజేశారు. అలాగే మండలంలోని ఇడిమేపల్లి చెరువును రైతులతో కలిసి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే   మాట్లాడుతూ నియోజక వర్గానికి సంబంధించి వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పథకాలు, సాగునీటి పథకాల మరమ్మతుల కోసం అవసరమైన నిధులను మంజూరు చేయించామన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ఏ సరళ, వివిధ శాఖల అధికారులు, పలువురు వైసీపీ నాయకులున్నారు. 


Updated Date - 2021-12-16T04:55:26+05:30 IST