‘సీపీఎస్‌ రద్దు హామీ తప్పొద్దు’

ABN , First Publish Date - 2021-12-20T03:37:50+05:30 IST

సీపీఎ్‌సను రద్దు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీ.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.

‘సీపీఎస్‌ రద్దు హామీ తప్పొద్దు’
సమావేశంలో మాట్లాడుతున్న రాజశేఖర్‌

యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 19: సీపీఎ్‌సను రద్దు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జీ.రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక జేఎం ఫంక్షన్‌ హాల్‌లో యూటీఎఫ్‌ మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బోధనకు ఆటకంగా ఉన్న యాప్‌లను తొలగించాలన్నారు. 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. 71 డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గౌరవాధ్యక్షుడుగా కె.మాలకొండారెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌ఎంకేవీ రాజు, ఎలిషా, సహోధ్యక్షుడిగా ఎన్‌.రామకృష్ణ, కోశాధికారిగా నస్రుల్లాను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.చంద్రశేఖర్‌రెడ్డి, ఎడమ తిరుపతయ్య, సుబ్బారెడ్డి, ఫణి, ఖాదర్‌బాషా, దస్తగిరి అహ్మద్‌, రామిరెడ్డి, అంజాద్‌, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T03:37:50+05:30 IST