చెరకు బకాయిలు చెల్లించే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2021-03-22T04:51:28+05:30 IST

ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.

చెరకు బకాయిలు చెల్లించే వరకూ పోరాటం

ఎమ్మెల్యే కాకాణి

పొదలకూరు(రూరల్‌), మార్చి 21 : ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు బకాయిలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని ప్రభగిరిపట్నం సూదులగుంట షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద రైతులు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్యే ఆదివారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.11కోట్లు బకాయిలు చెల్లించే వరకూ రైతుల పక్షాన నిలబడి పోరాడతామన్నారు. ఇక్కడ బ్యాంకర్లు ఫ్యాక్టరీ యాజమాన్యంతో లాలూచీపడి రైతులకు ద్రోహం చేయడానికి సిద్ధపడినట్లు అనుమానంగా ఉందన్నారు. ఈ వ్యవహారం పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ చేత విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.85కోట్లకు చెల్లని చెక్కు కలెక్టర్‌కు అందించి మోసం చేయడం దారుణమన్నారు.  కార్యక్రమంలో పెద్దమల్లు రమణారెడ్డి, గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోనం బ్రహ్మయ్య, రైతుసంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T04:51:28+05:30 IST