అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-02-02T03:03:24+05:30 IST
పంచాయతీ ఎన్నికలలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే, వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నెల్లూరు పార్ల

-అబ్దుల్ అజీజ్
కావలి,ఫిబ్రవరి1: పంచాయతీ ఎన్నికలలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తే, వారిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. కావలి టీడీపీ కార్యాలయంలో సోమవరం వైసీపీకి చెందిన చెంచుగానిపాలెం మాజీ సర్పంచు జ్వాలారావు ఆయన అనుచరులతో టీడీపీలో చేరారు. అజీజ్ వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అల్లూరు మండలం పురిణికి చెందిన ఎరువుల వ్యాపారి తన అనుచరుడిని పంచాయతీ సర్పంచుకి టీడీపీ మద్దతుతో నామినేషన్ వేయించారని అన్నారు. దానిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు వ్యవసాయశాఖ అధికారులచే ఆయన ఎరువుల దుకాణంపై దాడి చేయించి సీజ్ చేశారన్నారు. అలాగే గ్రామాలలో ఎన్నికల సమయంలో బైండోవర్ కేసులు పెట్టేటప్పుడు రెండు పార్టీటల వారిపై పెట్టడం ఆనవాయితీ అన్నారు. అయితే పోలీసులు టీడీపీ అనుచరులపై కేసులు పెట్టి వైసీపీ అనుచరులను రౌడీలలా రోడ్లపై వదిలితే కుదరదన్నారు. ఈ విషయమై అడిషనల్ డీజీపీకి మేరకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కావలి డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీలకు టీడీపీ అనుచరులు 90 శాతం నామినేషన్లు వేయటంతో వైసీపీ ఎత్తులు ఫలించలేదన్నారు. టీటీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి రాబోతుందన్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతుగంటి అలేఖ్య, గుత్తికొండ క్రిషోర్, మొగిలి కల్లయ్య, కాకి ప్రసాద్, గుంటుపల్లి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.