ఉద్యమాలే శరణ్యం

ABN , First Publish Date - 2021-12-09T03:06:12+05:30 IST

హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు.

ఉద్యమాలే శరణ్యం
తహసీల్దారు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

కోట, డిసెంబరు 8 : హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం రెవెన్యూ, అంగన్‌వాడీ, సీఐటీయూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేశారు.  పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశాడన్నారు.  ఆయా హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. 

Updated Date - 2021-12-09T03:06:12+05:30 IST