జలపాతం వద్దకు పోటెత్తిన సందర్శకులు
ABN , First Publish Date - 2021-11-21T05:30:00+05:30 IST
అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉదయగిరి దర్గంపై సల్వాపేట్ జలపాతం, సెలయేళ్లు జాలువారుతుండడంతో పర్యాటకులను అమితంగా అకట్టుకొంటుంది.

ఉదయగిరి రూరల్, నవంబరు 21: అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉదయగిరి దర్గంపై సల్వాపేట్ జలపాతం, సెలయేళ్లు జాలువారుతుండడంతో పర్యాటకులను అమితంగా అకట్టుకొంటుంది. ఆదివారం జలపాతం తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు. చెక్‌డ్యాం, సెలయేరులో సేదతీరుతూ ఆనందంగా గడిపారు. ఉదయగిరి పట్టణంతోపాటు ఆత్మకూరు, వింజమూరు, పామూరు, బద్వేల్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి వెలుగొండ అందాలను తిలకిస్తూ మైమరిచిపోయారు.