ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-10-30T03:27:29+05:30 IST

ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు అన్నారు.

ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, ఆర్డీవో మురళీకృష్ణ, డిఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి

 గూడూరు, అక్టోబరు 29: ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు అన్నారు.  పోలీసు అమరవీరుల వారోత్సవాలలో బాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో మోటార్‌సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినపుడు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు రెడ్డి, నాగేశ్వరమ్మ, ఎస్‌ఐలు పవన్‌కుమార్‌, గోపాల్‌, రోజాలత, తిరుపతయ్య, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల అభివృద్దికి చర్యలు

పట్టణంలోని మున్సిపల్‌ పాఠశాలలను నాడు-నేడు పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వరప్రసాద్‌ రావు తెలిపారు. శుక్రవారం స్థానిక జీఎస్‌ఆర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని పది పురపాలక పాఠశాలల్లో  పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీకాంత్‌, హెచ్‌ఎం మున్వర్‌భాషా, బొమ్మిడి శ్రీనువాసులు, కోడూరు మీరారెడ్డి, మురళి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T03:27:29+05:30 IST