రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-09-04T04:31:11+05:30 IST

ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఒక ట్రక్కు ఆటో వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
తీవ్రంగా గాయపడ్డ తంగరాజు

తడ, సెప్టెంబరు 3 : ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఒక ట్రక్కు ఆటో వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు నైవేలి నుంచి శ్రీసిటీ సెజ్‌కు ఒక కంటైనర్‌ లారీ శుక్రవారం బయలుదేరింది. మధ్యాహ్నం మండలంలోని పన్నంగాడు జాతీయ రహదారి వద్ద ఉన్న ఉన్న ఓ పంక్చర్‌ షాపు వద్ద కంటైనర్‌ను నిలిపి టైర్లకు గాలి తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో చెన్నై నుంచి తడకు వేగంగా వస్తున్న ట్రక్కు ఆటో ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు ఆటోలో ఉన్న క్లీనర్‌ తంగరాజుకు తీవ్ర, గాలి తనిఖీ చేస్తున్న పంక్చర్‌షాపు యజమాని రఘుకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చెన్నైకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-04T04:31:11+05:30 IST