పొట్టి శ్రీరాములుకు నివాళి
ABN , First Publish Date - 2021-12-16T03:30:08+05:30 IST
స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వాసవీక్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు నివాళులర్పించారు.

గూడూరు, డిసెంబరు 15: స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వాసవీక్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు నివాళులర్పించారు. నాయకులు బొంతల వెంకటేశ్వర్లు, ప్రసాద్, చంద్రశేఖర్, హరిబాబు, మోహన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాముల చిత్రపటానికి కార్యాలయ సిబ్బంది నివాళులర్పించారు.
కలువాయి : నూకనపల్లి ప్రాథమిక పాఠశాలలో కలువాయి వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి, వాసవీ క్లబ్ అధ్యక్షులు పువ్వాడి కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయుడు బి.మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.