వాడవాడలా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి
ABN , First Publish Date - 2021-07-09T05:01:21+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలుజరిగాయి.

నాయుడుపేట టౌన్, జూలై 8 : రైతు బాంధవుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా నాయుడుపేటలో గురువారం ఆయన విగ్రహం వద్ద భారీ కేకును కట్‌చేసి నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు పంపిణీ చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణమాఫీ చేసిన ఘనత వైఎస్‌ఆర్ దే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, వైసీపీ నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, కట్టా రమణారెడ్డి, 786 రఫీ, కామిరెడ్డి రాజారెడ్డి, వేణుంబాక లక్ష్మీనారాయణరెడ్డి, కలికి మాధవరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, జయరామ్, ధనలక్ష్మి, రాఽధాకిషోర్‌యాదవ్, చదలవాడ కుమార్, సిద్ధయ్య, భరత్, చంద్రారెడ్డి, భాను, నాగార్జున, సాధుమోహన్, రత్నశ్రీ ఉన్నారు. అనంతరం నాయుడుపేట మండలం కల్లిపేడు పంచాయతీలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.
సూళ్లూరుపేట : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేకును కట్‌చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైసీపీ మండల పట్టణ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌రెడ్డి, కళత్తూరు శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారంరెడ్డి కృష్ణారెడ్డి, శివాలయం ట్రస్టుబోర్డు చైర్మన్ నలుబోయిన రాజసులోచనమ్మ, వైసీపీ నేతలు జెట్టి వేణు, కళత్తూరు రామమోహన్‌రెడ్డి, గోగుల తిరుపాల్, సన్నారెడ్డి కృష్ణారెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పెళ్లకూరు: పెళ్లకూరు, పుల్లూరు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలుజరిగాయి. పెళ్లకూరులో వైసీపీ నాయకులు బైనా చంద్రశేఖర్‌రెడ్డి (బీసీఆర్), కరణం రఘునాయుడు, పట్టూరు మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్‌లు, మిఠాయిలు పంచిపెట్టారు. వైసీపీ మండల అధ్యక్షుడు మారాబత్తిన సుధాకర్ తన సొంత గ్రామం పూల్లూరులో సర్పంచ్ చిందేపల్లి శ్రీనివాసులురెడ్డితో కలసి వైఎస్‌ఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బైనా శ్యామ్‌రెడ్డి, ముర ళీ, సురేంద్ర, ప్రసాద్, వాసు, సురేష్, గోవర్థన్, రత్నయ్య, రమణయ్య, మునెయ్య, చెంగ య్య పాల్గొన్నారు.
దొరవారిసత్రం : స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మండల కార్యాలయం ఎదుట ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులతో కలసి కేకును కట్‌చేసిన కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ శ్రీనివాసులురెడ్డి, నాయకులు దువ్వూరు గోపాల్‌రెడ్డి, రామమోహన్‌రెడ్డి, మునస్వామినాయుడు, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బట్టా రమణయ్య, పాల్గొన్నారు. రైతుభరోసా కేంద్రాల్లో వైఎస్‌ఆర్ జయంతిని నిర్వహించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులతో కలసి వైఎస్‌ఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోడిలింగాలపాడు వద్ద అక్కంపేట, మాంబట్టు సెజ్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ విగ్రహాలకు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల భారీ కేకులను కట్‌చేసి పంచిపెట్టారు. అన్నదానం చేశారు. కొండూరు గ్రామంలో బాణసంచా కాల్చారు. కార్యక్రమాలలో ఏఎంసీ చైర్మన్ మారంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, నాయకులు కొలవి రఘు, గండవరం సురేష్‌రెడ్డి, ఉచ్చూరు మునస్వామిరెడ్డి, రవిరెడ్డి, హుస్సేన్, శేఖర్‌బాబు, జయకుమార్‌రెడ్డి, నత్తం శ్రీనివాసులు, సర్పంచులు ఆర్మూగం, వెంకటమ్మ పాల్గొన్నారు.
ఫోటో : 8 ఎస్‌పేట 3ఎ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఆందోళన కారులు
పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా రాస్తారోకో
సూళ్లూరుపేట, జూలై 8 : పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను నిరసిస్తూ సూళ్లూరుపేటలో గురువారం సీపీఐ, విద్యార్థి, యువజన సంఘాల నేతలు స్తారోకో నిర్వహించారు.జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ మండల కార్యదర్శి ఓగూరు కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నేత బాలయ్య, పి. రమణయ్య, ఏఐఎస్‌ఎఫ్‌కు చెందిన మోదుగుల వినోద్, రమణ, ఎస్‌ఎఫ్‌ఐ గుణ, పీడీఎస్‌యూ లోకేష్, రాజ, నాగరాజు పాల్గొన్నారు.
