ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం
ABN , First Publish Date - 2021-08-24T07:01:25+05:30 IST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. టంగుటూరి జయంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి సోమవారం కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్
నెల్లూరు (వీఆర్సీ) ఆగస్టు 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. టంగుటూరి జయంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి సోమవారం కమిషనర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు సేవలు అందించారన్నారు. బ్రిటిష్ ప్రభుత్వ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో.......
ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీ యూనివర్సటీ స్థాపనకు ప్రకాశం పంతులు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడు చంద్రమౌళీ, వాసుదేవరావు, నరసింహం, సురేంద్ర పాల్గొన్నారు.
పోరాట యోధుడు ప్రకాశం : అబ్దుల్ అజీజ్
బ్రిటీష్ సైమన్ కమిషన్ తుపాకి గుండుకు ఎదురొడ్డిన పోరాట యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గంగాధర్, సుధాకర్, సాబీర్ జాన్, రాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘భారతరత్న’ ఇవ్వాలి
నెల్లూరు (సాంస్కృతికం) : టంగుటూరి ప్రకాశం పంతులుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల అధ్యక్షుడు వీ చంద్రమౌళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆంధ్ర కేసరి 150వ జయంతి సందర్భంగా ఏసీ మార్కెట్ వద్ద గల ప్రకాశం పంతులు విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
