మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళి

ABN , First Publish Date - 2021-11-01T04:59:20+05:30 IST

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళి
నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు

 సంక్షేమ, అభివృద్ధి పథకాలతో చిరస్థాయి గుర్తింపు

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 31 : దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇందిరాభవన్‌, నవాబుపేట, ఆర్‌టీసీ వద్ద ఉన్న ఆమె విగ్రహాలకు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి, నేతలు పూలమాలలు వేసి  శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చేవూరు మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ప్రజల హృదయాల్లో ఆమె చిరస్ధాయిగా నిలిచిపోయారని అన్నారు.  ఆమె అన్ని వర్గాల వారికి అభివృద్ది, సంక్షేమ  పథకాలు  అందించారన్నారు. ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోయేలా చక్కటి పాలన అందించారని చెప్పారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం నోవా బ్లడ్‌బ్యాంకులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఉడతా వెంకట్రావ్‌, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు ఏటూరు శ్రీనివాసులురెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్‌, నగర ఇన్‌చార్జి ఫయాజ్‌, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు కొండా అనిల్‌కుమార్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పప్పర్తి గణేష్‌బాబు, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ అల్లాఉద్దీన్‌, షేక్‌ మస్తాన్‌, రాజేష్‌రెడ్డి, హుస్సేన్‌బాషా  పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T04:59:20+05:30 IST