వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-09-03T04:29:18+05:30 IST

గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజా రంజకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఆర్టీసీ కూడలి ప్రాంతంలో గురువారం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి, చిత్రపటానికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు పూలమాలలు నివాళులు అర్పించారు.

వైఎస్‌ఆర్‌కు ఘన నివాళి
నాయుడుపేట ఆర్టీసీ కూడలి ప్రాంతంలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి, నాయకులు

నాయుడుపేట, సెప్టెంబరు 2 : గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజా రంజకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఆర్టీసీ కూడలి ప్రాంతంలో గురువారం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి, చిత్రపటానికి  ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నాయకులు పూలమాలలు నివాళులు అర్పించారు. అనంతరం  అన్నదానం చేశారు. అగ్రహారపేటలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీకాళహస్తి బైపాస్‌రోడ్డులో మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, చైర్‌పర్సన్‌ కటకం దీపిక, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కలికి మాధవరెడ్డి, వైస్‌ చైర్మన్‌లు రఫీ,  వెంకటకృష్ణారెడ్డి,  వైసీపీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, రాధాకిశోర్‌యాదవ్‌  ఉన్నారు.

సూళ్లూరుపేట :స్థానిక బస్టాండ్‌ వద్ద ఉన్న వైఎస్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాలలో మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, చెంగాళమ్మ ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మున్సిపల్‌ వైఎస్‌ చైర్మన్‌లు పోలూరు పద్మ, చిన్ని సత్యనారాయణ, వైసీపీ నేతలు కళత్తూరు శేఖర్‌రెడ్డి, అల్లూరు అనిల్‌రెడ్డి, నలుబోయిన రాజసులోచనమ్మ, గోగుల తిరుపాల్‌ పాల్గొన్నారు.  మున్సిపాలిటీలోని మన్నారుపోలూరు గ్రామ సచివాలయంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గురువారం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను తాత్కాలికంగా  ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌, తహసీల్దారు రవికుమార్‌ హాజరయ్యారు. అనంతరం మన్నారుపోలూరు శివార్లలోని జగనన్న ఇంటి స్థలాల లేఅవుట్‌లో మొక్కలు నాటారు. 

నాయుడుపేట టౌన్‌, :  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైసీపీ నాయకులు గంధవల్లి సిద్దయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని చైర్‌పర్సన్‌ దీపిక ప్రారంభించారు. తొలుత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు గంధవల్లి భరత్‌, బైనా మల్లికార్జున్‌రెడ్డి, చెంచయ్య, దారా రవి, బంగారుబాబు, కటకం జయరామయ్య, రాహుల్‌ తదితరులు ఉన్నారు. 

తడ: వైసీపీ నాయకులు స్థానిక బోడిలింగాలపాడు వద్ద ఉన్న వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలవి రఘు, ఉచ్చూరు మునస్వామిరెడ్డి, కోదండం, శశికుమార్‌, జయకుమార్‌రెడ్డి, చంద్రారెడ్డి, సర్పంచులు ఆర్మూగం, అఫ్రీద్‌ తదితరులు ఉన్నారు. 

పెళ్లకూరు : కేంద్ర సహకారబ్యాంక్‌ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. నాయకులు బైనా చంద్రశేఖర్‌రెడ్డి, ీపి.మోహన్‌రెడ్డి,  నెలబల్లి శేఖర్‌రెడ్డి, లింగమనాయుడు, లోకేష్‌నాయుడు, పెళ్లకూరు సర్పంచ్‌ తడగల వాణి, చిల్లకూరు సర్పంచ్‌ హరిబాబురెడ్డి, కేసు ప్రసాద్‌, పెరుమాలపల్లి సుధాకర్‌నాయుడు, వెంకటేశ్వర్లు, పెళ్లకూరు జడ్పీటీసీ, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-09-03T04:29:18+05:30 IST