మహిళా మేట్‌లకు శిక్షణ

ABN , First Publish Date - 2021-08-22T04:13:04+05:30 IST

స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో ఎంపికైన మహిళా మేట్‌లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మహిళా మేట్‌లకు శిక్షణ

సంగం, ఆగస్టు 21: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో ఎంపికైన మహిళా మేట్‌లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నాగేంద్రబాబు మాట్లాడుతూ ఉపాధి హామి పథకంలో ఇక నుంచి మహిళలు మాత్రమే మేట్‌లుగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించిదన్నారు. ఆ మేరకు మహిళా మేట్‌లను గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం ఏపీవో శ్రీనివాసరావు ఉపా ధి పనుల విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు, మహిళా మేట్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-22T04:13:04+05:30 IST