పౌరసేవలపై శిక్షణ

ABN , First Publish Date - 2021-12-31T04:33:42+05:30 IST

నాయుడుపేట డివిజన్‌లోని గ్రామ సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు, గ్రామ రెవెన్యూ అధికారులకుౖగురువారం సూళ్లూరుపేట గోకులకృష్ణ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ-సర్వీసెస్‌ ఆధునీకరణపై టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణ శిక్షణ ఇచ్చారు.

పౌరసేవలపై శిక్షణ
పౌరసేవలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న అధికారులు

సూళ్లూరుపేట, డిసెంబరు 30 :  నాయుడుపేట డివిజన్‌లోని గ్రామ సచివాలయాల డిజిటల్‌ అసిస్టెంట్లు, వార్డు, గ్రామ రెవెన్యూ అధికారులకుౖగురువారం సూళ్లూరుపేట గోకులకృష్ణ ఇంజనీరింగ్‌ కళాశాలలో  ఈ-సర్వీసెస్‌ ఆధునీకరణపై టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాలకృష్ణ శిక్షణ ఇచ్చారు. సూళ్లూరుపేట ఇన్‌చార్జి ఎంపీడీవో శింగయ్య, నాయుడుపేట ఎంపీడీవో శివప్రసాద్‌, సూళ్లూరుపేట తహసీల్దారు రవికుమార్‌ హాజరయ్యారు. డివిజన్‌లోని నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, ఓజిలి, పెళ్లకూరు, తడ మండలాల వార్డు, గ్రామ రెవెన్యూ అధికారులు, డిజిటల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మండల పరిధిలోని సామాంతమల్లాం గ్రామంలో స్థానిక తహసీల్దారు రవికుమార్‌ గురువారం సాయంత్రం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను వివరించారు. పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T04:33:42+05:30 IST