ప్రజలకు మెరుగైన సేవలు అందించండి

ABN , First Publish Date - 2021-08-11T04:26:31+05:30 IST

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించండి
రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్న ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 10: సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని శకునాలపల్లి రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. అలాగే నాడు-నేడు పనులు పూర్తి చేసిన పాఠశాల, నిర్మాణంలో ఉన్న ఆర్‌బీకే, సచివాలయ భవనాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఆయన తొలుత ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యశాలలోని కొవిడ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న అక్సిజన్‌ ప్లాంట్‌ పనులు పరిశీలించారు. థర్డ్‌వేవ్‌ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరాస్వామి, సర్పంచు కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, వైద్యులు గోవర్థన్‌రెడ్డి, ఏఈవో భోగ్యం సుధీర్‌కుమార్‌, కార్యదర్శి కరీముల్లా, వీఏఏ చల్లా పూజిత, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-08-11T04:26:31+05:30 IST