కల్వర్టు నిర్మాణంతో ట్రాఫిక్‌ స్తంభన

ABN , First Publish Date - 2021-06-22T03:36:41+05:30 IST

నాయుడుపేటలోని అమరావతి సెంటర్‌ వద్ద కల్వర్టును నిర్మిస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది

కల్వర్టు నిర్మాణంతో ట్రాఫిక్‌ స్తంభన
కల్వర్టు నిర్మాణ పనులతో స్థంభించిన ట్రాఫిక్‌

నాయుడుపేటలోని అమరావతి సెంటర్‌ వద్ద కల్వర్టును నిర్మిస్తుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నాయుడుపేట పట్టణంలో నుంచి మురుగునీరు బయటకు ప్రవహించే కాలువపై నేషనల్‌ హైవే అధికారులు - పూతలపట్టు రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఈ మార్గం ద్వారానే నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం రహదారికి ఇరువైపులా కిలోమీటరు దాటి రోడ్డుపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అధికారులు కల్వర్టు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వాహన దారులు కోరుతున్నారు.

    -  నాయుడుపేట టౌన్‌Updated Date - 2021-06-22T03:36:41+05:30 IST