సెల్‌టవర్‌కు వ్యతిరేకంగా నిరసన

ABN , First Publish Date - 2021-03-23T03:02:56+05:30 IST

బుచ్చిలోని ఎస్‌ఆర్‌ మస్తాన్‌ హోటల్‌ వీధిలో ఓ భవనంపైన సెల్‌టవర్‌ నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను సోమవారం ఆవీధిలోని సుమారు 100మంది

సెల్‌టవర్‌కు వ్యతిరేకంగా నిరసన
: నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

బుచ్చిరెడ్డిపాళెం,మార్చి22: బుచ్చిలోని ఎస్‌ఆర్‌ మస్తాన్‌ హోటల్‌ వీధిలో ఓ భవనంపైన సెల్‌టవర్‌ నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలను సోమవారం ఆవీధిలోని సుమారు 100మంది మహిళలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.  సెల్‌టవర్‌ నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడల్లా అక్కడవారు అడ్డుకుంటున్నారు. సోమవారం టవర్‌ ఏర్పాటు చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేయడంతోపాటు గంటకు పైగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో టవర్‌ నిర్మాణ పనులకు వచ్చిన ఎయిర్‌టెల్‌ సిబ్బంది వెనుదిరిగారు. మంగళవారం నగర పంచాయతీ అధికారులతోపాటు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మహిళలు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-23T03:02:56+05:30 IST