ఇద్దరు పండితుల మృతి

ABN , First Publish Date - 2021-05-30T04:22:41+05:30 IST

నగరం ఇద్దరు పండితులను కోల్పోయింది. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌, సాహితీవేత్త త్వరకవి వెంకట బాలకృష్ణమూర్తి(86), మోపూరు వేణుగోపాలయ్య(80) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు.

ఇద్దరు పండితుల మృతి
బాలకృష్ణమూర్తి,వేణుగోపాలయ్య

నెల్లూరు(సాంస్కృతిక, ప్రతినిధి), మే 29 :  నగరం ఇద్దరు పండితులను కోల్పోయింది. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌, సాహితీవేత్త త్వరకవి వెంకట బాలకృష్ణమూర్తి(86), మోపూరు వేణుగోపాలయ్య(80) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. బాలకృష్ణమూర్తి సూళ్లూరుపేట, నెల్లూరు  ప్రభుత్వ కళాశాలల్లో పని చేశారు. ఆయన గ్రంధాల్లో ద్రౌపది, శ్రీనివాసరామానుజం, హనుమత్‌ విజయం ప్రముఖమైనవి. పలు గ్రంధాలను టీటీడీ ఆర్థిక సహాయంతో ప్రచురించారు. మోపూరు వేణుగోపాలయ్య వీఆర్‌సీ విద్యార్థి. ఎస్‌వీ యూనివర్శిటీలో పీజీ చేసి వీఆర్‌సీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. తెలుగు శాఖాధిపతిగా ఉద్యోగ విరమణ చేశారు. సరస్వతీ సమాజం, వర్థమాన సమాజం, పద్యకళాపరిషత్‌లతో అనుసంధానమై నిత్యం సాహితీ సేవలో పరితపించిన వ్యక్తి. దాదాపు సరస్వతీ సమాజంలో 22 ఏళ్లపాటు పురాణ ప్రవచనాలు చెప్పారు. రామాయణం, మహాభారతం, భాగవతంపై నిత్య ప్రవచనాలు అందించారు. ఆయన వద్ద ప్రత్యేక శిక్షణతో ఎంతోమంది పీహెచ్‌డీలు చేశారు. సివిల్స్‌ కూడా ఆయన  తెలుగులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆ ఇద్దరి పండితుల మృతికి పలు సాహిత్య సంస్థలు సమాజాలు నివాళి తెలిపాయి.

Updated Date - 2021-05-30T04:22:41+05:30 IST