అడుసు వీధులు.. అధ్వానపు రోడ్లు !

ABN , First Publish Date - 2021-12-16T04:15:24+05:30 IST

నెల్లూరు రూరల్‌ మండలంలోని గ్రామల మధ్య రోడ్లు అధ్వానంగా తయారై ప్రయాణాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయి. ములు ముడి - తాటిపర్తి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది.

అడుసు వీధులు..  అధ్వానపు రోడ్లు !
ఇటీవల వరదలకు దెబ్బతిన్న ములుముడి రోడ్డు

పల్లెల్లో సమస్యల జాతర 

ఊర్ల మధ్య దెబ్బతిన్న రహదారులు

పారిశుధ్య లేమి... పొంచి ఉన్న రోగాల ముప్పు 

ఓటీఎస్‌పై వ్యతిరేకత 

నేడు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం 

ఫ ప్రశ్నించేందుకు ప్రతిపక్షం కరువు


నెల్లూరు రూరల్‌, డిసెంబరు 15 : నెల్లూరు రూరల్‌ మండలంలోని గ్రామల మధ్య రోడ్లు అధ్వానంగా తయారై ప్రయాణాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయి. ములు ముడి - తాటిపర్తి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ మార్గంలో చిన్న వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇదేవిధంగా మండలంలోని అనేక గ్రామాలకు రోడ్లు ఛిద్రమై పల్లె ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక, గ్రామాల్లో వీధులు కూడా అధ్వానంగా ఉన్నా యి. మురుగు, బురద, వ్యర్థాలతో నిండిన పల్లెలు పారిశుధ్య లేమితో కొట్టుమిట్టాడు తున్నాయి. పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో గ్రామా లు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. కాలువల్లో వ్యర్థాలు చేరి మురుగు పారుదల లేక దుర్వాసన, దోమల బెడద తీవ్రంగా ఉంది. ఫలితంగా విషజ్వరాలు ప్రజలను పట్టిపీడి స్తున్నాయి. ప్రాణాంతక రోగాలు ప్రబలుతాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతు న్నారు.

ఓటీఎస్‌ వద్దేవద్దు..

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన ఓటీఎస్‌ పథకంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొదుపు గ్రూపుల్లోని మహిళల ఖాతాల్లో నిధులు ఓటీఎస్‌కు జమ చేయడంపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టం లేకపోయినా ఓటీఎస్‌కు నగదు జమ చేయమని ఒత్తిచేయడమేమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సంభవించిన వరదలు, వర్షాలతో నష్టపోయిన రైతులు పరిహారం ఎప్పుడు అందుతుందా.. అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దెబ్బతిన్న పొలాలను ఉపాధి హామీ పథకం ద్వారా బాగుచేయాలని అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు. కాగా, నెల్లూరు రూరల్‌ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరగనుంది. అయితే గ్రామీణుల సమస్యలను సమావేశంలో లేవనెత్తి చర్చించేందుకు ప్రతిపక్షం లేకపోవడంతో అంతా ఏకపక్ష తీర్మానాలే ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులే చొరవ తీసుకుని సమస్యలపై అర్థవంత మైన చర్చను సాగించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-12-16T04:15:24+05:30 IST