మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు
ABN , First Publish Date - 2021-02-02T04:19:36+05:30 IST
గూడూరు డివిజన్‌లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు.

గూడూరు, ఫిబ్రవరి 1: గూడూరు డివిజన్‌లో మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. అధికారుల నియామకం పూర్తయిందన్నారు. ప్రతి అధికారి తమ విఽధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.