శివాలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-12-08T04:32:21+05:30 IST

మండలంలోని మంగానెల్లూరు గ్రామ శివాలయంలో సోమవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.

శివాలయంలో చోరీ
చోరీ జరిగిన శివాలయాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ రవిబాబు

సూళ్లూరుపేట, డిసెంబరు 7 : మండలంలోని మంగానెల్లూరు గ్రామ శివాలయంలో సోమవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తలుపుల గడులను వంచి తాళాలు పగలగొట్టి చోరీచేశారు. నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు, హుండీలో సుమారు రూ. 5వేలను దోచుకుపోయారు. మంగళవారం ఉదయం ఆలయ తలుపులు పగలగొట్టి ఉండటం చూసి న గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. సూళ్లూరుపేట ఎస్‌ఐ రవిబాబు సంఘనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T04:32:21+05:30 IST