10 మూగజీవాల మృతి

ABN , First Publish Date - 2021-12-26T04:31:15+05:30 IST

మండలంలోని గరిమెనపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో గిరిజనుడు అంకయ్య పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది.

10 మూగజీవాల మృతి
దగ్ధమైన గుడిసె వద్ద బాధిత గిరిజనులు

అగ్ని ప్రమాదంలో పూరిగుడిసె దగ్ధం

రాపూరు, డిసెంబరు 25: మండలంలోని గరిమెనపెంట గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో గిరిజనుడు అంకయ్య పూరిగుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 10 మూగజీవాలు ( మేకలు, గొర్రెలు ) కాలి బూడిదయ్యాయి. కొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. ఆ గిరిజన కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడింది. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధితులు వేడుకొంటున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

Updated Date - 2021-12-26T04:31:15+05:30 IST