పాలకమండలి సభ్యులు సేవకుల్లా పని చేయాలి

ABN , First Publish Date - 2021-09-03T03:31:03+05:30 IST

ధర్మకర్తల మండలి సభ్యులు స్వామి వారి సేవకులుగా పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.

పాలకమండలి సభ్యులు సేవకుల్లా పని చేయాలి
ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకమండలి సభ్యులు

ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

డక్కిలి, సెస్టెంబరు 2 : ధర్మకర్తల మండలి సభ్యులు స్వామి వారి సేవకులుగా పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. దేవునివెల్లంపల్లి లోని స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు.  ఆలయ అభివృద్ధికి కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.   అనంతరం  పాలకమడలి చైర్మన్‌గా నర్రావుల ప్రకాశం నాయుడు, ఇతర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు కలిమిలి రాంప్రసాద్‌ రెడ్డి, జిల్లా సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టరు వెలికంటి రమణారెడ్డి,   వెంకటగిరి పోలేరమ్మ ఆలయ చైర్మన్‌ గొల్లగుంట మురళీకృష్ణ, నక్కా వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-03T03:31:03+05:30 IST