రెండో విడతలో 7844 మందికి టీకా వేశాం : డీఎంహెచ్‌వో
ABN , First Publish Date - 2021-02-07T02:47:10+05:30 IST
రెండో విడత కొవిడ్ టీకాను జిల్లాలో శనివారం నాటికి 7844మంది ఉద్యోగులకు వేయగలిగామని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. మనుబోలు పీహెచ్‌సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ చేసిన ప్రదేశాలను పరిశీ

మనుబోలు, ఫిబ్రవరి 6: రెండో విడత కొవిడ్ టీకాను జిల్లాలో శనివారం నాటికి 7844మంది ఉద్యోగులకు వేయగలిగామని డీఎంహెచ్‌వో డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. మనుబోలు పీహెచ్‌సీని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ చేసిన ప్రదేశాలను పరిశీలించారు. వ్యాక్సిన్ గురించి వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో విడతలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు కలిపి 31,344మందికి వేయాల్సి ఉందన్నారు. ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగులకు మాత్రం టీకా వేయడం లేదన్నారు. టీకా వేయడంతో కొంతమందికి మాత్రమే స్వల్పంగా జ్వరం, జలుబు, వళ్లు నొప్పులు మాత్రమే వస్తాయన్నారు. ఒకటిరెండు రోజుల్లో తగ్గుతాయన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుబ్బరాజు, శ్వేత, సీహెచ్‌వో రాజయ్య తదితరులు పాల్గొన్నారు.