నేడు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన

ABN , First Publish Date - 2021-08-28T04:41:01+05:30 IST

టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు శనివారం ఉదయం 9-30 గంటలకు మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపును

నేడు టీడీపీ ఆధ్వర్యంలో నిరసన

ఆత్మకూరు, ఆగస్టు 27 : టీడీపీ అధిష్ఠానం పిలుపు మేరకు శనివారం ఉదయం 9-30 గంటలకు మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెట్రోల్‌, గ్యాస్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2021-08-28T04:41:01+05:30 IST