టీడీపీ కార్యాలయంలో ముందస్తు భోగి

ABN , First Publish Date - 2021-01-13T05:05:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో ముందస్తు భోగి వేడుకలు జరిగాయి.

టీడీపీ కార్యాలయంలో ముందస్తు భోగి
భోగి మంటలో జీవో ప్రతులు వేస్తున్న టీడీపీ నాయకులు

ప్రభుత్వ విధానాలపై నేతల ఆగ్రహం


నెల్లూరు(వైద్యం), జనవరి 12 : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు ఆధ్వర్యంలో ముందస్తు భోగి వేడుకలు జరిగాయి. కార్యాలయం ఎదుట భోగి మంట వేశారు. రైతు రుణమాఫీ జీవో, ప్రజావ్యతిరేక జీవోలను ఆ మంటలో తగులబెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ భోగితో రాష్ట్రానికి పట్టిన పీడ పోవాలన్నారు. విద్యుత్‌ మోటార్లు బిగించే జీవో,  వైఎస్సార్‌ రైత భరోసా హామీ జీవో, సున్నావడ్డీ కింద చంద్రబాబు నాయుడు రూ. 3లక్షలు ఇస్తే, జగన్మోహన్‌రెడ్డి కేవలం రూ. లక్ష ఇస్తున్నారని ఈ జీవో, ప్రైవేట్‌ కళాశాలలకు పీజీ రద్దుచేసే జీవోలు కూడా భోగి మంటల్లో తగుల బెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు భూలక్ష్మి, సత్యనాగేశ్వరరావు, జలదంకి సుధాకర్‌, కప్పిర శ్రీనివాసులు, ఆకుల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:05:10+05:30 IST