సమర్థులతో టీడీపీ వార్డు కమిటీలు

ABN , First Publish Date - 2021-10-30T03:22:46+05:30 IST

టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కావలి పట్టణంలో వార్డు కమిటీలు సమర్థులతో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

సమర్థులతో టీడీపీ వార్డు కమిటీలు
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : చేజర్ల

కావలి, అక్టోబరు 29: టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కావలి పట్టణంలో వార్డు కమిటీలు సమర్థులతో ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా కమిటీలు వేయాలన్నారు. ఎన్నికైన కమిటీ సభ్యులు ఆయా వార్డుల సమస్యలు గుర్తించి పరిష్కారదిశగా పోరాటం చేయాలన్నారు. నవంబరు మొదటి వారంలోగా వార్డు కమిటీలు పూర్తి చేసి రెండవ వారంలో పట్టణ, అనుబంధ కమిటీలు పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కావలి మున్సిపాల్టీలో చేపట్టిన అభివృద్ధిని, వైసీపీ రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిచాలన్నారు. ఈ సమావేశంలో నేతలు గుత్తికొండ కిషోర్‌, కండ్లగుంట మధుబాబు నాయుడు, మలిశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంధి యానాదిశెట్టి, బొట్లగుంట శ్రీహరినాయుడు, రాజకుమార్‌ చౌదరి, జ్యోతి బాబూరావు, మొగిలి కల్లయ, కాకి ప్రసాద్‌, దావులూరి దేవకుమార్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T03:22:46+05:30 IST