రోడ్ల అధ్వానంపై టీడీపీ నేతల నిరసన

ABN , First Publish Date - 2021-07-25T04:05:04+05:30 IST

చిత్తూరు జిల్లా సత్యేవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీకోట పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉండడంపై టీడీపీ నేతలు శనివారం వినూత్న నిరసన తెలిపారు.

రోడ్ల అధ్వానంపై టీడీపీ నేతల నిరసన
అధ్వానరోడ్లపై మట్టి పోసి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌

గూడూరురూరల్‌, జూలై 24: చిత్తూరు జిల్లా సత్యేవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీకోట పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉండడంపై టీడీపీ నేతలు శనివారం వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ తిరుపతిపార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి జడ్డా రాజశేఖర్‌, తిరుపతి, సూళ్లూరుపేట, వెంకటగిరి,  గూడూరు మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, నెలవల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పాశి సునీల్‌ కుమార్‌ రోడ్లను మట్టితో పూడ్చి, వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

Updated Date - 2021-07-25T04:05:04+05:30 IST