సజ్జాపురం భాధితులకు టీడీపీ ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2021-05-21T04:15:13+05:30 IST

ఇటీవల ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో మరణించిన నెల్లూరురూరల్‌ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన వారి కుటుంబాలకు టీడీపీ నాయకులు ఆర్థిక సహాయాన్ని అందించారు.

సజ్జాపురం భాధితులకు టీడీపీ ఆర్థిక సహాయం
భాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న టీడీపీ నాయకులు

నెల్లూరురూరల్‌, మే 20 : ఇటీవల ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో మరణించిన నెల్లూరురూరల్‌ మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన వారి కుటుంబాలకు టీడీపీ నాయకులు ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం ఆ పార్టీ నాయకులు సాభీర్‌ఖాన్‌, సుధాకర్‌ గ్రామంలోని భాధిత కుటుంబ సభ్యులకు రూ. 10 వేలు అందించారు.  నెల్లూరురూరల్‌ టీడీపీ ఇన్‌చార్జి అజీజ్‌ ఆర్థిక సహాయాన్ని  అందజేశారని వారు తెలిపారు. ప్రమాదం జరిగి 15 రోజులు గడుస్తున్నా భాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించకపోవడం  బాధాకరమన్నారు. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందితే కేవలం ఒక్కరికే ప్రమాదబీమా మంజూరు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్‌ బీమాలో కుటుంబ పెద్దకి ప్రమాదం జరిగితేనే పరిహారం ఇస్తామనడం ప్రభుత్వ సిగ్గుమాలినతనానికి నిదర్శనమని దుయ్యపట్టారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాశం గోపాలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:15:13+05:30 IST