పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ నిరసనలు

ABN , First Publish Date - 2021-11-10T04:49:25+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మంగళవారం స్థానిక తాజ్‌ పెట్రోల్‌ బంకువద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి ఆయన నిరసన తెలిపారు.

పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ నిరసనలు
మేనకూరు పెట్రోల్‌ బంకు వద్ద నిరసన తెలుపుతున్న నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు

 : 1 ఎన్‌పేట 9 :

1 ఏటికె 9 : నాయుడుపేట: 

సూళ్లూరుపేట, నవంబరు 9 : ‘రాష్ట్రంలో పెట్రోల్‌,  డీజిల్‌ ధరలు తగ్గించడం చేతకాకపోతే మా నేత చంద్రబాబుతో కలవండి.. కేంద్రంతో ఆయన పోరాడి ధరలు తగ్గిస్తాడు’ అంటూ మాజీ ఎమ్మెల్యే,  సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల  వైసీపీ పాలకులకు హితవు చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై మంగళవారం స్థానిక తాజ్‌ పెట్రోల్‌ బంకువద్ద టీడీపీ నేతలు,  కార్యకర్తలతో కలసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తమ చేతుల్లో లేవని సిగ్గులేకుండా చెబుతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రం తమిళనాడులో  లీటరు రూ. 7 తక్కువకు డీజల్‌, పెట్రోల్‌ దొరుకుతోందన్నారు. తమిళనాడు సీఎం ప్రజలపై భారం పడకూడదని రాష్ట్ర వ్యాట్‌ తగ్గిస్తే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 22 దోచుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. తిరుపతి పార్లమెంట్‌  నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌, మండల్ట అధ్యక్షుడు లొక్కు శంకరయ్య, ఏజీ కిశోర్‌, చిట్టేటి పేరుమాల్‌, మార్కెండేయులు, రాజేశ్వరి, పెంచలయ్య  పాల్గొన్నారు. 

నాయుడుపేట: వైసీపీ ప్రభుత్వ పాలనలో అధిక ధరలు పేదలకు పెనుభారంగా  మారాయని సూళ్లూరుపేట నియోజవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు. చమురుధరలు తగ్గించాలంటూ మేనకూరు పెట్రోల్‌ బంకువద్ద మంగళవారం టీడీపీ నాయకులతో కలసి నెలవల నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచే విధంగా నిత్యావసర ధరలు, చమురుధరలు పెంచాయని విమర్శించారు. చమురు ధరలు పెరగడంవలన వ్యవసాయరంగం కూడాభాగా దెబ్బతిన్నదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లోటుబడ్జెట్‌ ఉన్నా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలపై భారంమోపలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్‌ ప్రసాద్‌, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండల అధ్యక్షులు దువ్వూరు అశోక్‌రెడ్డి, సంచి కృష్ణయ్య, గుజ్జలపూడి విజయకుమార్‌నాయుడు, నాయకులు దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డి, అవధానం సుధీర్‌, సుబ్బారావు, రవి, దార్ల రాజేంద్ర, మాజీ సర్పంచ్‌ పల్లేటి రమణయ్య, సూరిబాబు, గోపాల్‌రెడ్డి  పాల్గొన్నారు. 

ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం స్థానిక పెట్రోల్‌ బంకుల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, మండల అధ్యక్ష ప్రధానకార్యదర్శులు సుంకర పెంచల చౌదరి, కేతా విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను తగ్గించినా మన రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా తగిం్గచే పరిస్థితులు కనిపించడం లేదని విమర్శించారు.వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.   అనంతరం పెరిగిన ధరలను తగ్గించాలని వినియోగదారుల నుంచి సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో  తెలుగుయువత జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లునాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు తలచీరు బాబునాయుడు, రైతు సంఘం జిల్లా కార్యాదర్శి మద్దినేని నారాయణ, తోడేటి వెంకటయ్య, గోరీషబ్బీర్‌, 22వ వార్డు కౌన్సిలర్‌ మాదాల శ్రీనివాసులునాయుడు, టిఎన్‌ఎఫ్‌ఎస్‌ నాయకులు మారుతీనాయుడు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.Updated Date - 2021-11-10T04:49:25+05:30 IST