పింఛన్ తొలగించడం అన్యాయం
ABN , First Publish Date - 2021-09-04T03:10:12+05:30 IST
ఎన్నికలకు ముందు వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, టీడీపీ జిల్లా ఆర్గనౌజింగ్ కార్యదర్శి యేగూరి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు.

వాడవాడలా టీడీపీ నిరసన
కావలి, సెస్టెంబరు 3: ఎన్నికలకు ముందు వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పింఛన్లు తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, టీడీపీ జిల్లా ఆర్గనౌజింగ్ కార్యదర్శి యేగూరి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పింఛన్ల తొలగింపులో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలో లేకపోవటంతో డీఈ శ్రీనివాసులుకు వినతిపత్రం అందచేశారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వ మన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట వెయ్యి, తరువాత రూ.రెండు వేలకు పెంచారని చెప్పారు. దానిని రూ.3 వేలు ఇస్నాన్న జగన్ ప్రస్తుతం తొలగింపు పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కారక్రమంలో టీడీపీ నాయకులు అన్నపూర్ణ శ్రీను, గొట్టిపాటి వంశీకృష్ణ, కాకి ప్రసాద్, గుత్తికొండ క్రిషోర్, బొట్లగుంట శ్రీహరి నాయుడు, రాజకుమార్ చౌదరి, తటవర్తి వాసు కుందుర్తి కిరణ్, పల్లపు కుమార్, మైనంపాటి మంజుల, మల్లిఖార్జునరెడ్డి, మంచాల ప్రసాద్ , గొట్టిపాటి రాము తది తరులు పాల్గొన్నారు. ఉదయగిరి మండల అభివృద్ధి అధికారి కార్యాలయం ఎదుట టీడీపీ మండల కన్వీనరు బయ్యన్న ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జా నరసింహులు, జెల్సా, నాగయ్య, రియాజ్, ఖాన్‌సా, నల్లిపోగు రాజా, అబిద్, తదితరులు పాల్గొన్నారు. దుత్తలూరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏవో వెంకటరమణమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున, ఎంపీటీసీ కండ్లగుంట వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చల్లా ప్రసాద్, చిన్నపరెడ్డి, కంభం సింగవరపు సుబ్బారెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీతారామపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు వెంకటేశ్వర్లు, తమ్మిశెట్టి రమణయ్య, సుబ్బరాయుడు, చిన్నాగంపల్లి మాజీ సర్పంచు మాలకొండయ్య, పెద్ద గౌస్, సులోచనమ్మ, కరుణాకర్‌రెడ్డి, మహాలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
