మంత్రి అనిల్ అవినీతి నిజమైంది
ABN , First Publish Date - 2021-07-09T03:57:12+05:30 IST
నిజాయితీ అంటూ విర్రవీగిన మంత్రి అనిల్ రూ.వందకోట్ల ఇసుక దోపిడీ చేసింది నిజమని తేలడంతో ఎక్కడికి వెళ్లిపోయాడని టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడంపై గురువారం గనులశాఖ కార్యాలయంలో మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లుకు కోటంరెడ్డి వినతి పత్రం అందిచారు.

పెన్నానదిని తవ్వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
లేకుంటే గ్రీన్ ట్రిబ్యునల్‌కి వెళ్తాం
టీడీపీ నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి
నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 8 : నిజాయితీ అంటూ విర్రవీగిన మంత్రి అనిల్ రూ.వందకోట్ల ఇసుక దోపిడీ చేసింది నిజమని తేలడంతో ఎక్కడికి వెళ్లిపోయాడని టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపడంపై గురువారం గనులశాఖ కార్యాలయంలో మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లుకు కోటంరెడ్డి వినతి పత్రం అందిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖిలపక్షం అంటూ కొన్ని రోజులు నాటకాలాడిన మంత్రి దోపిడీ నిజమని నిరూపణ అయిందన్నారు. పేదల ఇళ్ల పేరుతో పెన్నానదిలో 30 అడుగుల మేర ఇసుక తవ్వకాలు జరిపి తరలించారన్నారు. మంత్రి అనుచరులు దాదాపు రూ.100 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మంత్రి అనిల్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, భువనేశ్వరీ ప్రసాద్, జహీర్, ప్రశాంత్, సుజన్, శుభన్ తదితరులు పాల్గొన్నారు.