పింఛన్ల తొలగింపుపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-09-04T05:09:44+05:30 IST

అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

పింఛన్ల తొలగింపుపై టీడీపీ నిరసన
సూపరింటెండెంట్‌కు వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

నెల్లూరు రూరల్‌, సెప్టెంబరు 3 : అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు జెన్ని రమణయ్య, సపంత్‌కుమార్‌ మాట్లాడుతూ పింఛను పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రెండేళ్లుగా దానిని అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రోజులు గడిపేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌, రంగారావు, సాబీర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T05:09:44+05:30 IST