తప్పులతడకగా ఓటరు జాబితా
ABN , First Publish Date - 2022-01-01T04:31:23+05:30 IST
గూడూరు మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాను తప్పులతడకగా రూపొందించారని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ విమర్శించారు.

గూడూరు, డిసెంబరు 31: గూడూరు మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాను తప్పులతడకగా రూపొందించారని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ విమర్శించారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేసిన అనంతరం ఓటరు జాబితా రూపొందించడంతో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. పాత ఓటరు జాబితా నుంచి చనిపోయినవారి పేర్లు తొలగించాలని, ఏ వార్డుకు సంబంధించిన వారి ఓట్లు ఆ వార్డులోనే ఉండేలా చూడాలని వినితిపత్రం అందజేశామన్నారు. అయితే అధికారులు వార్డుల హద్దుల ప్రకారం కానీ, ఓటర్ల డోర్ నంబర్లు ఉండే విధంగా కానీ లేకుండా జాబితాను తయారు చేశారన్నారు. వీటిపై చర్యలు తీసుకుని సవరణలతో కూడిన కొత్త జాబితాను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో నెలబల్లి భాస్కర్‌రెడ్డి, బిల్లు చెంచురామయ్య, కొండూరు వెంకటేశ్వర్లురాజు, పెంచలయ్య, శివప్రసాద్, సాయి, శ్రీనివాసులు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.